కొట్యాల మల్లన్న ఆశీస్సులతో పాడి పంటలు -పశు సంపద సల్లంగుండాలి..
మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోచబోయిన శ్రీహరి యాదవ్ హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ )...
- మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అఖిల భారత యాదవ
మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోచబోయిన శ్రీహరి యాదవ్
హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
శుక్రవారం రోజు అఖిల భారత యాదవ మహాసభ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్, ములుగు మండల అధ్యక్షులు యంజాల ఐలయ్య యాదవులతో కలిసి.. కొట్యాల మల్లన్న స్వామిని దర్శించుకుని పోచబోయిన శ్రీహరి యాదవ్ మొక్కులు చెల్లించారు.. అనంతరం భక్తులనుద్దేశించి మాట్లాడుతూ మల్లన్న ఆశీస్సులతో పాడి పంటలు, పశు సంపద సల్లంగుండాలని, స్వామివారు ఎల్లవేళలా మనకు అండగా ఉంటారని.. మల్లన్న పశు పాలకులకు బర్కతిగల్ల దేవుడని., మీరంతా లింగాల గణేష్ గుప్తా సహకారంతో, అత్యంత భక్తి శ్రద్దలతో ఆలయాన్ని నిర్మించుకొని పూజల్లో మమ్మల్ని ఆహ్వానించి, భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.. ఇంకా ఈ కార్యక్రమంలో.. పత్తి వెంకటేష్ యాదవ్, బొల్లు రాము యాదవ్, చీర్ల రఘువర్ధన్ యాదవ్, కాటుక నర్సింలు యాదవ్, కొత్త రామకృష్ణా రెడ్డి, సత్తి కృష్ణారెడ్డి, బాలవతి రాజు, వనం మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సాలంద్రి మల్లేశం యాదవ్, ఎం. బాబు యాదవ్, ఎం. పెద్దిరాజు, సత్యనారాయణ, హన్మయ్య, గణేష్, ముత్యాలు, శ్రీకాంత్, రమేష్, కుమార్ యాదవ్ తదితర యాదవ నేతలు పాల్గొన్నారు..