ఆజ్ కి బాత్
అప్పులెన్నో జేసిర్రు… అభివృద్దని అంటుర్రు., వచ్చిన ఆమ్దానంత వడ్డీలకే కడుతుర్రు.. ఉద్యోగుల జీతాలకు బాండులన్ని అమ్ముతుర్రు…
అప్పులెన్నో జేసిర్రు…
అభివృద్దని అంటుర్రు.,
వచ్చిన ఆమ్దానంత వడ్డీలకే కడుతుర్రు..
ఉద్యోగుల జీతాలకు బాండులన్ని
అమ్ముతుర్రు…
ఆ భవనం, ఈ భవనం పోటివడి కడుతుర్రు..
అదే ఘనకార్యమని భాక వెట్టి ఊదుతుర్రు…
బార్లన్ని మిల మిల.. జేబులన్ని గల గల…
ఖాజానేమో వెల వెల..
రైతులేమో విలవిల…
తెలంగాణ పయనమేటు
వెలుగుల దివ్వెల వైపా…
చీకటి చిట్టడివి వైపా……
- కాతరాజు శంకర్..