అక్షరాన్ని నమ్ముకున్నఅక్షర యోధులు
సమాజం కోసం కలం పట్టిన చేతులు.. గూడు కోసం చేయి చాపి అడుక్కుంటున్నా పట్టించుకోని నేతలు… కలానికి రెండంచుల ఖడ్గం అని అంటారే.. కానీ.. పక్షపాత ధోరణితో పాలకుల కుటిలబుద్ధి దేనికి నిదర్శనం..
సమాజం కోసం కలం పట్టిన చేతులు..
గూడు కోసం చేయి చాపి అడుక్కుంటున్నా
పట్టించుకోని నేతలు…
కలానికి రెండంచుల ఖడ్గం అని అంటారే..
కానీ..
పక్షపాత ధోరణితో పాలకుల కుటిలబుద్ధి
దేనికి నిదర్శనం..
అక్షరాన్ని నమ్ముకున్న
అక్షర యోధులకు..
గూడు కోసం జాగ ఇవ్వడం అంత కష్టమా…
మీ కబ్జాలు అడిగామా !?
ధన ధాన్యాలు అడిగామా!?
మణి మాణిక్యాలు అడిగామా!?
కాస్తంత నీడ కోసం గుంటెడు జాగ
ఇమ్మని పోరాడుతున్నాo…
పట్టించు కోని పాలకులను
ఏమని ప్రశ్నించాలి!?
ఎవరిని అడగాలి!? బ్రతుకంతా పోరాటం..
బ్రతుకంటే వెలుగునీడల సంగమం.